శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కళింగ కోమటి యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం రాత్రి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఆట పాటలతో అందరినీ అలరించాయి. ప్రతి ఏటా సంక్రాంతి రోజున అల్లుళ్లు, కుమార్తెలను సత్కరించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచీ భారీ సంఖ్యలో కుటుంబాలు తరలివచ్చాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి.
కంచిలిలో...
కంచిలిలోని బలియా పుట్టుగ కాలనీలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పెద్దలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు వీక్షకులను అలరించాయి. సినీ గీతాలకు తమదైన స్టెప్పులు వేస్తూ ఆద్యంతం ఆకట్టుకున్నారు. స్థానికులు భారీ ఎత్తున ఈ ఉత్సవాలకు చూసేందుకు తరలివచ్చారు.
ఇదీ చదవండి: