శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం జాతీయ రహదారిపై బాణాపురం వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా మ్యాజిక్ వాహనం డివైడర్ను ఢీకొన్న ఘటనలో నరసన్నపేట మండలం ఉర్లాం గ్రామానికి చెందిన లక్ష్మణరావు మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
జీవనోపాధి నిమిత్తం తమిళనాడు వెళ్లిన లక్ష్మణరావు శనివారం ఉదయం చెన్నై నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. అనంతరం క్వారంటైన్ కేంద్రంలో ఉండాలని అధికారులు సూచించారు. నరసనన్నపేట క్వారంటైన్ కేంద్రంలో ఖాళీ లేకపోవటంతో గ్రామ వాలంటీర్తో కలిసి వజ్రపుకొత్తూరు పునరావాస కేంద్రానికి బయల్దేరారు. ఈ సమయంలో ప్రమాదం జరగటంతో లక్ష్మణరావును టెక్కలి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.