శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం బుచ్చింపేట గ్రామానికి చెందిన లమ్మి లక్ష్మి (28) దంపతులు రాజాంలో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారు సైకిల్‌పై వెళ్తుండగా డోల పేట సమీపంలో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ వెనుక టైర్ కింద పడి లక్ష్మి తీవ్రంగా గాయపడింది. పరిస్థితి విషమం కావటంతో రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మి మృతి చెందింది. లక్ష్మీ మృతిచెందడంతో భర్త తో పాటు ఇద్దరు ఆడపిల్లలు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. రాజాం ఎస్ ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి