కరోనా లాక్ డౌన్ కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలసకు చెందిన ప్రజలు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. వారంతా మే 3 తర్వాత తిరిగి ఆమదాలవలసకు రావడానికి అధికారులు రిలీఫ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం అన్ని చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ రవిసుధాకర్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలను రిలీఫ్ కేంద్రాలుగా చేస్తున్నట్లు తెలిపారు. సుమారు ఐదు వేల మందికి పైగా ఇక్కడకు వచ్చే అవకాశం ఉందన్నారు.
ఇదీ చదవండి: