శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో సోమవారం రాత్రి జరిగిన కొట్లాటలో ఓ వ్యక్తి చెందగా మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. హిరమండలానికి చెందిన కరణం తిరుపతిరావు, అతని బంధువులతో నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం జరిగిన తగాదాను పరిష్కరించుకునేందుకు పెద్దల సమక్షంలో సమావేశమయ్యారు. తగాదా మరింత పెద్దదైంది. అక్కడే తిరుపతిరావుపై బంధువులు దాడి చేశారు. తలకు తీవ్రగాయమైన ఆయన.. అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. తిరుపతిరావుపై దాడికి దిగిన బంధువులు పరారీలో ఉన్నట్లు ఎస్సై మధుసూదన్ తెలిపారు.
ఇదీ చదవండి: ఆరేళ్ల చిన్నారులపై అఘాయిత్యం