శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, నరసన్నపేట పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లను జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ మంగళవారం ప్రారంభించారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారి ఇబ్బందులు తొలగించేందుకు ఇవి దోహదపడతాయన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ సెంటర్లు మరింత చురుకుగా సేవ భావంతో పనిచేసే విధంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కార్యక్రమంలో సీఐ ప్రసాదరావు ఎస్సై కోటేశ్వరరావు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రహదారి భద్రతా మాసోత్సవాల పోస్టర్ విడుదల చేసిన కలెక్టర్