శ్రీకాకుళం జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని నరసన్నపేట మార్కెట్ కమిటీ ఆవరణలోని భరోసా కేంద్రాన్ని.. మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. అనంతరం సమీకృత వ్యవసాయ పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఆయనతోపాటు జేసీ సుమిత్ కుమార్, వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్ తదితరులు ఉన్నారు.
ఆమదాలవలస మండలం తోగరము గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని శాసన సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పూర్తి న్యాయం చేకూరుతుందని అన్నారు. గతంలో రైతులు విత్తనాలు, ఎరువులు కావాలంటే ఇబ్బందులు పడేవారని.. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా వాటిని సులభంగా పొందవచ్చన్నారు.
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రైతులకు అన్ని విధాల మేలు చేసే విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి స్పష్టం చేశారు. టెక్కలిలోని పీఏసీఎస్ ఆవరణలో కేంద్రాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాలు రైతు విజ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తాయని తెలిపారు. విత్తనం మొదలుకొని పంట అమ్మే వరకు అన్ని ప్రక్రియలలో సలహాలు, సూచనలు ఇస్తూ అన్నదాతలకు అండగా ఉంటాయన్నారు.
ఇవీ చదవండి...