శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం జాతీయ రహదారిపై లారీల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి వందలాది మంది వలస కూలీలు రాకపోకలు సాగిస్తున్నారు. అధికంగా ఒడిశా, భువనేశ్వర్, ఝార్ఖండ్ తదితర ప్రాంతాలకు లారీల్లో వెళుతున్నారు. ఈ క్రమంలో ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నవారికి శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో స్థానికులు ఆహారం అందించారు. లారీల్లో ప్రయాణిస్తున్న సుమారు వెయ్యి మందికి బొంతుపేట సమీపంలో స్థానికులు ఆహార పదార్థాలను అందించారు.
ఇదీ చూడండి వివాహాలపైనా లాక్డౌన్ ప్రభావం