ETV Bharat / state

పలు కేంద్రాల్లో వెంటాడుతున్న సమస్యలు - local body elections

పంచాయతీ ఎన్నికలు అధికారులకు కత్తిమీద సాములా మారాయి. ముఖ్యంగా పోలింగ్‌ కేంద్రాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయటం సవాల్‌గా మారింది. మిగిలిన ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికలు భిన్నం. ప్రతి వార్డుకు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని సిద్ధం చేయాలి. ఓటర్ల సంఖ్య పెరిగితే అదనపు కేంద్రాల ఏర్పాటూ తప్పనిసరి. ఆయా కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలి. దివ్యాంగులకు అనుకూలంగా ర్యాంపులు, రెయిలింగ్‌ ఏర్పాటు చేయాలి. తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు వంటివి సమకూర్చాలి. కొన్ని పాఠశాలల్లో నాడు-నేడు పనులు ఇంకా కొలిక్కి రాలేదు. మరికొన్ని చోట్ల ఇతరత్రా సమస్యలూ పీడిస్తున్నాయి.

పలు కేంద్రాల్లో వెంటాడుతున్న సమస్యలు
పలు కేంద్రాల్లో వెంటాడుతున్న సమస్యలు
author img

By

Published : Feb 1, 2021, 7:08 PM IST

జిల్లాలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని సంకల్పించారు. తొలిదశ ఎన్నికలు ఈనెల 9వ తేదీన జరుగుతాయి. వరుసగా 13, 17, 21 తేదీల్లో సంగ్రామాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఈ దఫా 1,190 పంచాయతీలకు 1,166 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరిషత్తు, శాసనసభ, పార్లమెంటు ఎన్నికలతో పోల్చితే పంచాయతీ ఎన్నికల నిర్వహణ కాస్త భిన్నంగా ఉంటుంది. ఎక్కువ మంది పోలింగ్‌ సిబ్బంది, కేంద్రాలు అవసరమవుతాయి. సర్పంచితోపాటు వార్డు సభ్యులు బరిలో నిలుస్తారు. ఇలాంటి చోట ప్రతి వార్డుకు ఒక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదే వార్డులో 650కు పైగా ఓట్లుంటే అదనంగా మరో పోలింగ్‌ కేంద్రం సైతం సిద్ధం చేయాలి. వార్డుల ప్రాప్తికి పంచాయతీకి 8-20 వరకు పోలింగ్‌ కేంద్రాలు అవసరమవుతాయని అధికార యంత్రాంగం గుర్తించింది.

ఉన్నవి...రెండే...

పాలకొండ: మండలంలోని వెలగవాడ పంచాయతీ పరిధిలోని పోలింగ్‌ కేంద్రంలో నాడు-నేడు పనులు పూర్తికాలేదు. 1,100 ఓట్లు ఉన్న ఈ కేంద్రంలో నాలుగు భవనాలు ఉన్నా, ఓ భవనంలో ఫర్నిచర్‌ మరో గదిలో సిమెంటు బస్తాలు ఉన్నాయి. ఇతర భవనాలు ఉన్నా వినియోగించేందుకు వీలు లేకుండా ఉన్నాయి. మరో భవనాన్ని రైతుభరోసా కేంద్రంగా ఉంచారు.

దివ్యాంగులకు ఇబ్బందే

ఆమదాలవలస: మండలంలోని నెల్లిమెట్ట పోలింగ్‌ కేంద్రంవద్ద దివ్యాంగులు, వృద్ధులు ఓట్లు వేసేందుకు వెళ్లాలంటే ర్యాంపు లేదు.

వీరఘట్టం: కంబరవలస కొత్త పంచాయతీలో కొత్తగా జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. 689 మంది ఓటర్లు ఉన్నా ఈ పోలింగ్‌ కేంద్రానికి మెట్లుమీద నుంచి ర్యాంపు సౌకర్యం లేదు.

గదులు, వరండాలో సామగ్రి నిల్వతో....

సోంపేట: తేలుకుంచి కేంద్రంలోని గదుల్లో సిమెంటు, టైల్స్‌ ఇతర పరికరాలు నిల్వ ఉంచారు. టి.బరంపురం కేంద్రంలో ప్రహరీ నిర్మాణం కూడా పూర్తికాకపోవడంతో ఇక్కడ పరిస్థితి అధ్వానంగా తయారైంది.

ఒకే గదిలో..

వీరఘట్టం: మండలంలోని యు.వెంకంపేట కొత్త పంచాయతీగా ఏర్పడింది. ఇక్కడ ఉన్న ప్రాథమిక పాఠశాలను కేంద్రంగా ఏర్పాటు చేశారు. 782 మంది ఓటర్లు ఈ పాఠశాలలోని ఒకే గదిలో ఓటు హక్కును వినియోగించుకోవాలి.

వసతులే కీలకం

స్థానిక సంస్థల ఎన్నికలు 2020లో నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. అందుకు అనుగుణంగానే 2019 డిసెంబరులో పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి ప్రతిపాదించారు. కరోనా నేపథ్యంలో మార్చిలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. జిల్లాలోని మూడో వంతు పాఠశాలల్లో ‘నాడు- నేడు’ పనులు చేపట్టారు. ఈ పాటికే శతశాతం పూర్తి కావాలి. నిధుల సమస్యతో కొన్ని చోట్ల కొలిక్కి రాలేదు. తాగునీరు, మరుగుదొడ్లు వసతుల కల్పన అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇంకొన్ని చోట్ల తుది మెరుగులు దిద్దుతున్నారు. వేల కొద్దీ పోలింగ్‌ కేంద్రాలు అవసరం కావటంతో పాఠశాలల భవనాలతో పాటు రైతు భరోసా కేంద్రాలను ఎంపిక చేశారు. అవసరమైన గదులు లేకపోవటంతో కొన్ని చోట్ల రెండో అంతస్తులో పోలింగ్‌ కేంద్రం గుర్తించి ప్రతిపాదించారు. అంతస్తులో పోలింగ్‌ కేంద్రం ఉండకూడదన్న సూచనలు రావటంతో ప్రత్యామ్నాయాలు చూడాల్సి వస్తోంది. కొన్ని చోట్ల తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి పోలింగ్‌ పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు.

ఓటర్లకు ఇబ్బందులు రానీయం

పోలింగ్‌ కేంద్రాలన్నీ సిద్ధం చేస్తున్నాం. అక్కడక్కడ వసతుల సమస్య ఉందని మా దృష్టికి వచ్చింది. దీనిపై జిల్లా పాలనాధికారి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. భవనాలు కూల్చేయటం వంటి పరిస్థితులు ఉండి..అనివార్యమైతే తప్ప పోలింగ్‌ కేంద్రాలను మార్చొద్దని కరాఖండీగా చెప్పాం. నాడు-నేడు పనుల మెటీరియల్‌ గదుల్లో ఉంటే తొలగిస్తాం. తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు సమకూర్చాలని సూచించాం. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలుంటే అన్నింటినీ పరిష్కరిస్తాం. పోలింగ్‌కు ముందే అన్నింటినీ అధిగమిస్తాం.

- బి.రవికుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి, శ్రీకాకుళం

ఇవీ చదవండి: అనాథ శవాన్ని భుజాలపై మోసుకెళ్లిన మహిళా ఎస్సై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.