శ్రీకాకుళం జిల్లా రాజాంలో అధికారులు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. పాలకొండ డీఎస్పీ శ్రీలత, రాజాం రూరల్ సీఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులతో సేవ్ లైఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాటిక, నృత్యా ప్రదర్శనతో ట్రాఫిక్ రూల్స్‌ని వివరించారు.
నిబంధనలు పాటించకపోతే జరిగే ప్రమాదాలను కళ్లకు కట్టారు. విద్యార్థుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరూ పక్కాగా నిబంధనలు పాటించాలని డీఎస్పీ తెలిపారు. ద్విచక్రవాహనం నడిపేటప్పుడు శిరస్త్రాణం ధరించాలని కోరారు. కుటుంబం సురక్షితంగా ఉండాలంటే అధికారుల సూచనలు పాటించాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు... తప్పిన పెను ప్రమాదం