ETV Bharat / state

మంత్రి అప్పల రాజు వ్యాఖ్యలపై భగ్గుమన్న తెదేపా... పలాసలో భారీ నిరసన ర్యాలీ - srikakula district news

గౌతు లచ్చన్నపై మంత్రి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. శ్రీకాకుళం జిల్లా పలాసలో తెదేపా నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ ధర్నాలో రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ ఆందోళన నేపథ్యంలో పలాసలో భారీగా పోలీసులు మోహరించారు.

police-imposed-section-144-in-palasa
పలాసలో 144వ సెక్షన్
author img

By

Published : Jan 8, 2021, 10:21 AM IST

Updated : Jan 8, 2021, 12:45 PM IST

పలాసలో భారీ నిరసన ర్యాలీ

శ్రీకాకుళం జిల్లా పలాసలో గౌతు లచ్చన్న విగ్రహం వద్ద తెదేపా నిరసన కార్యక్రమం చేపట్టింది. భారీగా పోలీసులు మోహరించారు. ఈ నిరసనలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, మాజీ మంత్రి గౌతు శ్యామ్‌సుందర్‌ శివాజీ, పలాస నియోజకవర్గ తెదేపా బాధ్యురాలు గౌతు శిరీష, ఎమ్మెల్యే అశోక్‌ పాల్గొన్నారు. గౌతు లచ్చన్నపై మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తెదేపా ఈ నిరసనకు దిగింది.

జగన్‌ జిమ్మిక్కులు హిందువులు నమ్మరు: అచ్చెన్న

విగ్రహాల విధ్వంసకుల్ని అరెస్టు చేయకుండా జగన్‌ ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. హిందువులు నమ్మరని.. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. విజయవాడలో ఆలయాల పునర్నిర్మాణం ఇప్పుడే గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తల నరకడానికి హిందువులు సిద్ధంగా ఉన్నారని అచ్చెన్నాయుడు ధ్వజ మెత్తారు. హిందూ దేవాలయాలపై దాడుల విషయంలో... కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా స్పందించాలని, సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరారు.

ఇదీ చదవండి:

ఒక్కటైన ఆంధ్రా అబ్బాయి, ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయి

Last Updated : Jan 8, 2021, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.