నాటుసారాను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శ్రీకాకుళం పోలీసులు పట్టుకున్నారు. ఆమదాలవలస నియోజకవర్గం లో పెద్దపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నాటుసారా ద్విచక్ర వాహనంపై తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆమదాలవలస ఎక్సైజ్ శాఖ అధికారులు సీఐ కె. మూర్తి బాబు, ఎస్ఐ చంద్రమోహన్ సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు. వీరు వద్ద నుంచి 30 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరు ఎల్.ఎన్.పేట మండలం కొండ ప్రాంతం నుంచి నాటు తరలిస్తున్నారని పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి...