శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని కృష్ణాపురం సహాయ సహకార పరపతి సంఘం సభ్యులు కరోనా నివారణ కోసం సీఎం సహాయనిధికి రూ.55,000 నగదును స్పీకర్ తమ్మినేని సీతారామ్కి అందించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పీకర్ తమ్మినేని సూచించారు. వైరస్ వ్యాప్తి కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని స్పష్టం చేశారు. కరోనాపై పోరాటానికి దాతలు విరివిగా విరాళాలు అందించాలని కోరారు.
ఇదీ చూడండి