ETV Bharat / state

రాజాంలో బాలికపై పెట్రోలుతో దాడి... పరిస్థితి విషమం - శ్రీకాకుళం జిల్లాలో బాలికపై పెట్రోలు దాడి

శ్రీకాకుళం జిల్లా రాజాంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ బాలికపై పెట్రోలు పోసి నిప్పంటించారు. పూర్తిగా శరీరం కాలిపోయిన స్థితిలో.. మంటలకు తట్టుకోలేక బాలిక వేసిన ఆర్తనాదాలతో... స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు.

రాజాం పట్టణంలో బాలికపై పెట్రోలు దాడి
రాజాం పట్టణంలో బాలికపై పెట్రోలు దాడి
author img

By

Published : Jan 29, 2020, 8:51 AM IST

రాజాం పట్టణంలో బాలికపై పెట్రోలు దాడి

శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఏడో తరగతి విద్యార్థిని భువనేశ్వరిపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. 80 శాతం కాలిన గాయాలతో ఉన్న బాధితురాలిని స్థానికులు గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న పాఠశాల ప్రిన్సిపల్.. విద్యార్థిని తల్లిని పిలిపించి మాట్లాడారు. తర్వాత కుమార్తెను తల్లి ఇంటికి తీసుకెళ్లింది. అనంతరం తల్లి బయటకు వెళ్లగా భువనేశ్వరి ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి బహిర్భూమికని వెళ్లింది. కొంతసేపటి తర్వాత తుప్పల్లో ఆమె కేకలు విని స్థానికులు వెళ్లి చూడగా.. అప్పటికే ఆమె కాలిన గాయాలతో ఉంది. మెరుగైన చికిత్స కోసం బాధితురాలని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు బాలికను ప్రశ్నించగా.. ఇద్దరు బాలురు తనపై పెట్రోలు పోసినట్లు చెప్పింది. పాఠశాలలో జరిగిన పరిణామాలు.. బాలిక చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి

గుంటూరులో మహిళ దారుణ హత్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.