మహిళ దారుణంగా హతమార్చిన దుండగులు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం యామర్రుల్లో ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. అర్ధరాత్రి చెరువు హెడ్ ట్యాంక్ వద్ద కేకలు వినిపించటంతో అక్కడకు పరుగులు తీసినట్లు స్థానికులు వివరించారు. అప్పటికే మహిళ రక్తపు మడుగులో పడి ఉందన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మహిళను మారణాయుధాలతో దారుణంగా దాడి చేసి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు యనమదల రాధగా గుర్తించారు. రాధ భర్త 8 సంవత్సరాల క్రితమే మరణించారనీ, అప్పటి నుంచీ ఆమె ఒంటరిగానే ఉంటున్నట్లు పోలీసులు వివరించారు. నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.ఇదీ చదవండి:
వజ్రాల దొంగలు అరెస్టు... రూ.7 లక్షల సొత్తు స్వాధీనం