ఈనెల 16న కడపలోని లాడ్జిలో ఓ వ్యక్తి నుంచి వజ్రాలు దొంగిలించి పారిపోయిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఏడు లక్షల విలువైన ఐదు వజ్రాలతో పాటు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గుజరాత్‌కు చెందిన వారని డీఎస్పీ సూర్యనారాయణ రాజు తెలిపారు. కడప నగరానికి చెందిన ఖాదర్ బాషా అనే వ్యక్తి నుంచి వజ్రాలు కొనుగోలు చేస్తామని నిందితులు నమ్మించారు. అనంతరం అతన్ని గదిలో బంధించి వజ్రాలతో పరారయ్యారు. నిన్న కడపలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా తారసపడ్డ వారిని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. ఇదే కేసులో కర్ణాటకకు చెందిన మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని త్వరలోనే వారిని పట్టుకొని పూర్తి సొమ్మును స్వాధీనం చేసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు.
ఇదీ చదవండి: