సీఎంకు వ్యతిరేక నినాదాలు చేసి అరెస్టైన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తికి బెయిల్ మంజూరైంది. ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత నినాదాలు చేశారంటూ, పోలీసులు వెంకటరమణమూర్తితోపాటు మరో 19 మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం వెంకటరమణమూర్తికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కొత్తూరు కోర్టులో హాజరుపరచగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇదీ చూడండి: 'బెయిల్పై బయట ఉన్న సంగతి మరిచారా...!'