Panchayats in trouble with government mistakes: రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలు పంచాయతీలకు శాపంగా మారాయి. కేంద్రం నిధులు కూడా సర్కారు నిర్వాకంతో పంచాయతీలకు రాకుండా నిలిచిపోతున్నాయి. 2020-21లో మొదలైన 15వ ఆర్థిక సంఘం 2025 -26తో ముగియనుంది. ఆరేళ్ల వ్యవధిలో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 10 వేల 231 కోట్ల సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది.
Panchayats Funds Diverted in AP : పంచాయతీలకు కేంద్రం నుంచి ఇచ్చే నిధులపైనా కన్నేసిన రాష్ట్ర ప్రభుత్వం వీటిని విద్యుత్తు ఛార్జీల బకాయిలకు మళ్లించడం ద్వారా పంచాయతీలను ఇబ్బందులకు గురి చేసింది. 14,15 ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి ఇప్పటివరకు 1,351.45 కోట్లకుపైగా నిధులను పంచాయతీల విద్యుత్తు ఛార్జీల బకాయిలకు ప్రభుత్వం విద్యుత్తు పంపిణీ సంస్థలకు మళ్లించింది. ఈ నిధులు 8,629 కోట్లు ఉంటాయని సర్పంచుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Diverted Panchayat Funds: ఇదేం సర్దు'పోటు' ?.. 5 నెలల్లో రూ.1,245 కోట్లు మళ్లింపు
AP Sarpanches Warning to CM Jagan : నిధుల మళ్లింపుపై దర్యాప్తు చేయించాలన్న సర్పంచుల ఫిర్యాదుపై కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఉప కార్యదర్శి విజయ్‌కుమార్ రాష్ట్రంలోని 3 జిల్లాల్లో ఇటీవల పర్యటించారు. నిధుల మళ్లింపుపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరడంతో పాటు 2022-23 సంవత్సరానికి రెండో విడతగా పంచాయతీలకు ఇవ్వాల్సిన 717.70 కోట్లను ప్రస్తుతానికి నిలిపివేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరం మరో నాలుగు నెలల్లో ముగియనుండగా ..రెండు విడతల్లో విడుదల చేయాల్సిన 2,031 కోట్లకు అతీగతీలేదు.
YSRCP Government on Panchayats Funds : పంచాయతీలకు సంబంధించిన ప్రతివిషయంలోనూ ఆర్థిక సంఘం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తూనే వచ్చింది. సాధారణంగా ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమవ్వాలి. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం నిధులను మళ్లించే వీలుండదన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. కానీ ఏడాదిన్నర తర్వాత గానీ రాష్ట్రంలో ఇది అమలు కాలేదు. బ్యాంకు ఖాతా తెరిపించకపోతే నిధులు నిలిపివేస్తామని కేంద్రం హెచ్చరించాకే వాటిని రాష్ట్రం అమలు చేసింది. రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు చేయాలని ఆదేశాలున్నా..వాటినీ ప్రభుత్వం పెడ చెవిన పెట్టింది.
నిధులను నిలిపివేస్తామని కేంద్రం అల్టిమేటం : సాధారణంగా స్థానిక సంస్థల పరిధిలో నుంచి వివిధ పద్దుల కింద ప్రభుత్వానికి జమయ్యే ఆదాయంలో ఎంత మొత్తం పంచాయతీలకు కేటాయించాలో రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తుంది. ఈ ఆదేశాలను సైతం రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో అమలయ్యాయి. 15వ ఆర్థిక సంఘం నిధులను నిలిపివేస్తామని కేంద్రం అల్టిమేటం ఇచ్చాకే ఐదో ఆర్థిక సంఘం ఏర్పాటు చేసింది.
పంచాయతీల నిధుల మళ్లింపుపై.. భగ్గుమంటున్న సర్పంచులు
Sarpanches Warning to YSRCP Government : కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధుల్లో పంచాయతీ పరిపాలన ఖర్చులకు నిర్దేశించిన 10శాతంలోనే విద్యుత్తు బకాయిలు చెల్లించాలి. కానీ సగటున 24 శాతం వరకు విద్యుత్తు ఛార్జీల బకాయిలకు మళ్లించింది. కొన్ని పంచాయతీల్లో 80 నుంచి 90 శాతం నిధులు మళ్లించింది. పంచాయతీలకు ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు పంచాయతీరాజ్ శాఖ ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలకు మళ్లించాలి. కానీ నేరుగా విద్యుత్తు సంస్థలకు మళ్లించారు.
సీఎం ఇంటిని ముట్టడిస్తాం : ప్రభుత్వ చర్యలను సవాలు చేస్తూ సర్పంచులు హైకోర్టులో కేసులు వేయడంతో 2022-23 సంవత్సరం తొలివిడత నిధుల్లో 250 కోట్లకు పైగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఈ ఏడాది డిస్కంలకు మళ్లించారు. తమకు తెలియకుండా ప్రభుత్వం నిధులు మళ్లించడం దారుణమన్న సర్పంచ్‌లు తీరు మార్చుకోకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఆర్థిక సంఘం నిధులను డిస్కంలకు మళ్లింపు : ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో సర్పంచుల ప్రమేయం లేకుండా కట్టడి చేస్తున్న ప్రభుత్వం.. పంచాయతీ పరిపాలన వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటోంది. సర్పంచుల అనుమతి, పంచాయతీ తీర్మానం లేకుండా ఆర్థిక సంఘం నిధులను డిస్కంలకు ప్రభుత్వం మళ్లించింది. పంచాయతీల పరిధిలో 11,162 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వీటిపై మాత్రం సర్పంచుల నుంచి వార్డు సభ్యుల వరకు ఎలాంటి అధికారాలూ లేకుండా చేసింది. సచివాలయాలపై పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేసింది.
క్రియాశీలకంగా గ్రామ వాలంటీర్లు : ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామాల్లో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన గ్రామ సభకు సర్పంచి ఛైర్మన్ అయినా వారి పాత్రను నామమాత్రం చేస్తూ గ్రామ వాలంటీర్లను నియమించింది. లబ్ధిదారుల ఎంపిక నుంచి పథకాలు అందించే వరకు వాలంటీర్లే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఆర్థిక సంఘం నిధులు పీడీ ఖాతాలోకి.. విలవిల్లాడుతున్న గ్రామ పంచాయతీలు