ETV Bharat / state

'జీవో నంబరు 2ను తక్షణమే రద్దు చేయాలి' - srikakulam district latest news

జీవో నంబరు 2ను వెంటనే రద్దు చేయాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.

protest against go no2
పంచాయతీ కార్యదర్శుల నిరసన
author img

By

Published : Mar 26, 2021, 5:46 PM IST

కార్యదర్శులకు ఉన్న డీడీవో పవర్​ రద్దుకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులు నిరసన చేపట్టారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 2ను తక్షణమే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సచివాలయం నుంచి సమర్థవంతంగా పని చేస్తున్నామని.. ఈ తరుణంలో తమను డీడీవో బాధ్యతల నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసమని పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు సింహాచలం ప్రశ్నించారు. తక్షణమే ఆ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 2 అమలు చేసి కార్యదర్శులకు ఉన్న డీడీవో బాధ్యతలు వీఆర్వోలకు అప్పగిస్తూ.. జీవో నంబరు 2ను రాష్ట్రప్రభుత్వం జారీ చేసింది. దీనికి నిరసనగా రాష్ట్ర పంచాయతీ సంఘ ఇచ్చిన పిలుపుమేరకు ఆందోళన చేపట్టినట్లు కార్యదర్శులు తెలిపారు.

ఇదీ చూడండి:

రాజధానిపై వ్యాజ్యాలు: మే 3 నుంచి రోజువారీ విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.