శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంకు(Oxygen-bank) ప్రారంభించారు. స్థానిక లక్ష్మీ టాకీస్ ఆవరణలో ఆక్సిజన్ బ్యాంకును జిల్లా కలెక్టర్ జె నివాస్ ప్రారంభించారు. కరోనా రోగులకు ప్రాణవాయువు అందించేందుకు ఇటువంటి సామాజిక కార్యక్రమాలు ఏర్పాటు గొప్ప విషయం అని కలెక్టర్ అన్నారు. ఆక్సిజన్ బ్యాంకు(Oxygen-bank)ను ఏర్పాటు చేసిన సినీ హీరో చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘం ప్రతినిధి ప్రవీణ్.. పాల్గొన్నారు.
ఇదీ చదవండీ.. 'ఆయిల్ సంస్థల అత్యాశ.. వినియోగదారునిపై భారం పెరిగేందుకు కారణం'