శ్రీకాకుళం జిల్లా నరసన్న పేటలో ఆందోళనకి దిగిన వలస కార్మికులకు ఎట్టకేలకు ఊరట లభించింది. వారిని స్వస్థలాలకు పంపేందుకు చర్యలు తీసుకున్నారు జిల్లా అధికారులు.
21 రోజులుగా పునరావాస కేంద్రాల్లో ఉంచి ఇళ్లకు పంపించలేదని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల పునరావాస కేంద్రంలో ఉంటున్న కూలీలు ఆందోళన చేశారు. ప్రత్యేక అధికారి ఆర్.వెంకటరామన్ జోక్యం చేసుకుని... సమస్యలను వీలైన త్వరగా పరిష్కామని హామీ ఇచ్చారు. ఆయన భరోసాతో అప్పటికి శాంతించారు కూలీలు. ఆయన వెంటనే విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ 53 మందికి పరీక్షలు చేసి స్వస్థలాలకు పంపించాలని ఆదేశించారు.
కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు... యుద్ధప్రాతిపదికన 53 మందికి వలస కార్మికులకు కరోనా పరీక్షలు నిరవహించారు. ఫలితాలు వచ్చాక... వారిందర్నీ ప్రత్యేక వాహనాల్లో సొంతూళ్లకు పంపించారు.
ఇవీ చూడండి