శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎన్జీవో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను ఉల్లంఘించే పనిచేస్తున్నాయని ఉద్యోగ సంఘ నాయకులు బాడన వెంకట్రావు, బొడ్డేపల్లి రామ గణపతి మండిపడ్డారు.
తక్షణమే సీపీఎస్ విధానం రద్దు చేయాలని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగస్థుల పై రాజకీయ వేధింపులు విడనాడాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాల పోస్టులు భర్తీ చేయాలని కోరారు.
ఇదీ చూడండి అచ్చెన్నాయుడి పిటిషన్ పై విచారణ.. రిజర్వ్‌లో తీర్పు