ETV Bharat / state

జిల్లావ్యాప్తంగా జోరందుకున్న నామినేషన్ ప్రక్రియ

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రెండో రోజు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, టెక్కలి, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో సర్పంచ్, వార్డు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా పాతపట్నం నామినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నివాస్, ఎస్పీ అమిత్ బర్దార్ పరిశీలించారు.

Nomination process for local body elections in Srikakulam district
జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జోరు
author img

By

Published : Jan 30, 2021, 7:07 PM IST

శ్రీకాకుళం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నామినేషన్ ప్రక్రియ రెండో రోజు కోలాహలంగా సాగింది. కొన్ని చోట్ల ప్రశాంతంగా జరగగా.. మరికొన్నిచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాతపట్నంలో నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ నివాస్, ఎస్పీ అమిత్ పరిశీలించారు.

పాతపట్నం నియోజకవర్గంలో..

పాతపట్నం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రెండో రోజు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. పాతపట్నం నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నివాస్, ఎస్పీ అమిత్ సందర్శించారు. అభ్యర్థుల వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. అలాగే నామినేషన్ వేసేందుకు వచ్చిన వారితో కలెక్టర్ మాట్లాడారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మొత్తం 159 పంచాయతీలు ఉండగా శుక్రవారం సాయంత్రం వరకు 123 పంచాయతీలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఆయా పంచాయతీలకు శని, ఆదివారాల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు చర్యలు చేపట్టారు.

టెక్కలి నియోజకవర్గంలో..

టెక్కలి నియోజకవర్గంలో రెండో రోజు నామినేషన్ కేంద్రాల వద్ద కోలాహలం కనిపించింది. పలువురు అభ్యర్థులు ఊరేగింపుగా వచ్చి నామినేషన్​లు వేశారు. కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి నియోజకవర్గంలోని పలు కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులను భారీగా మోహరించినట్లు పేర్కొన్నారు.

పలుచోట్ల ఘర్షణ వాతావరణ..

టెక్కలి నియోజకవర్గంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లిన అభ్యర్థులను వైకాపా నేతలు అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలను లాక్కోవడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టెక్కలి మండలంలో శాసనం పంచాయతీకి చెందిన చిలకన్న నుంచి నామినేషన్ పత్రాలను వైకాపా కార్యకర్త లాక్కోవడంతో.. పత్రాలు నలిగిపోయాయి. దీంతో ఘర్షణలు జరిగాయి. అలాగే తలగాం గ్రామ పంచాయతీ నుంచి పోటీ చేస్తున్న సర్పంచి, వార్డు సభ్యుల అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను వైకాపా కార్యకర్తలు తీసుకోవడంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తోపులాటలో సర్పంచ్ అభ్యర్థి చేతికి స్వల్ప గాయం అయినట్లు ఆమె తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు నామినేషన్ కేంద్రాల వద్దకు చేరుకుని భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఎచ్చెర్ల నియోజకవర్గంలో..

ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలంలో నామినేషన్ ప్రక్రియ రెండో రోజు కోలాహలంగా సాగింది. నామినేషన్ దాఖలు చేసేందుకు ఉదయం నుంచే సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు నామినేషన్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. కొన్ని పంచాయతీల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. సుమారు 20 పంచాయతీల్లో.. సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు.

ఇదీ చదవండి:

అక్రమ మద్యం పట్టివేత.. నిందితుల అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.