శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సంధిపేటలో దారుణం చోటుచేసుకుంది. తిప్పాన ఈశ్వరమ్మ(50) అనే మహిళను అదే గ్రామానికి చెందిన చిదపాన లక్ష్మణరావు(60) కత్తితో దాడి చేసి హత్య చేశాడు. గ్రామానికి సమీపంలోని జీడి తోటలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈశ్వరమ్మను హత్య చేసిన అనంతరం నిందితుడు పురుగుల మందు తాగి మృతి చెందాడు. వీరిద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధమే ఘటనకు కారణమని సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న టెక్కలి సీఐ శ్రీనివాసరావు, నౌపడ ఎస్సై మధుసూదన్‌రావు మృత దేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
మహిళను చంపి... తాను పురుగుల మందు తాగాడు - crime
ఓ మహిళను దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన కసాయి..... అనంతం తాను పురుగులమందు తాగి మరణించాడు.