శ్రీకాకుళం జిల్లా భామిని మండలం అనంతగిరి వద్ద ఈనెల 9న జరిగిన హత్యకు సంబంధించి నిందితులను గుర్తించినట్లు స్థానిక డీఎస్పీ శ్రావణి వెల్లడించారు. కొత్తూరుకు చెందిన బిట్టాక రవి(40) అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. రవికి ఉన్న చెడు వ్యసనాలను భరించలేక అతని మొదటి భార్యే.. ఓ వ్యక్తి సాయంతో హత్యకు పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: తెదేపా కార్యకర్తల ఇళ్లపై... వైకాపా శ్రేణుల దాడి