శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పురపాలికలోని కంటైన్మెంట్ జోన్లలో పారిశుద్ధ్య పనులను కమిషనర్ ఎం.రవిసుధాకర్ పరిశీలించారు. కంటైన్మెంట్ జోన్లలో మొదటగా నమోదైన కేసులు మినహా ఇతరులకు వ్యాధి సోకలేదని చెప్పారు.
అందరికి ముందస్తుగా స్వాబ్ టెస్టులు చేయించామని తెలిపారు. కోవిడ్ నియంత్రణకు ప్రతి ఒక్కరు.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని.. మాస్కులు ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ అధికారి పి.పోలారావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: