ETV Bharat / state

ఎంపీ రామ్మోహన్​ నాయుడుకు సంసద్ రత్న అవార్డు

పార్లమెంట్​లో గుక్కతిప్పుకోకుండా హిందీలో అనర్గళంగా మాట్లాడగల దిట్ట. అతి చిన్న వయస్సులోనే ఎంపీగా ఎన్నికైన తెదేపా నేత. ప్రత్యర్థులపై ప్రశ్నల వర్షం కురిపించగల మాటకారి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు. తండ్రి కింజారపు ఎర్రన్నాయుడు అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన...అతి తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు. ఇప్పుడు ఆయనను మరో అవార్డు వరించింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్ఫూర్తితో ఇస్తున్న సంసద్ రత్న అవార్డుకు రామ్మోహన్ నాయుడు ఎంపికయ్యారు.

ఎంపీ రామ్మోహన్​ నాయుడుకు సంసద్ రత్న అవార్డు
ఎంపీ రామ్మోహన్​ నాయుడుకు సంసద్ రత్న అవార్డు
author img

By

Published : Jun 24, 2020, 7:11 PM IST

Updated : Jun 24, 2020, 7:47 PM IST

శ్రీకాకుళం ఎంపీ రామ్మోహ‌న్‌ నాయుడును సంస‌ద్‌ర‌త్న అవార్డు వరించింది. అతి పిన్న వ‌య‌స్సులోనే ఎంపీగా ఎన్నికైన రామ్మోహన్ నాయుడు ఈ అవార్డు అందుకోవటం మరో ఘనత. పార్లమెంటు స‌భ్యునిగా క‌న‌ప‌రిచిన అత్యుత్తమ ప‌నితీరు, ప్రజాస‌మ‌స్యలపై ఎంపీ చూపిస్తున్న చొర‌వ‌ను గుర్తించిన జ్యూరీ కమిటీ ఈ ప్రత్యేక అవార్డుకు రామ్మోహన్ నాయుడు పేరును సూచించింది.​ దేశ‌వ్యాప్తంగా 8 మంది పార్లమెంటు స‌భ్యులు, ఇద్దరు రాజ్యస‌భ స‌భ్యుల‌ను 2019-20 సంవత్సరం సంస‌ద్ ర‌త్న అవార్డుల‌కు ఎంపిక చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల జ్యూరీ కమిటీ ఈ ఎంపిక చేసింది.

ప్రజాసేవ‌కు దక్కిన గౌర‌వంగా భావిస్తున్నాన‌ని ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాజ‌కీయ ప్రముఖులు శశి థరూర్, సుప్రియ సులే వంటి సీనియర్ నాయకులతో కలిసి ఈ అవార్డును అందుకోనుండడం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. మాజీ రాష్ట్రప‌తి డాక్టర్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో 2010లో సంస‌ద్ రత్న అవార్డులను ప్రారంభించారు. కొవిడ్ -19 వైర‌స్ వ్యాప్తి త‌గ్గి, లాక్‌డౌన్ నిబంధ‌న‌లు స‌డ‌లించిన త‌ర్వాత అవార్డుల ప్ర‌దాన కార్యక్రమం ఉంటుంద‌ని ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్, సంస‌ద్ రత్న అవార్డుల కమిటీ ఛైర్మన్ కె. శ్రీనివాసన్ తెలిపారు.

  • చంద్రబాబు అభినందనలు..

సంసద్‌రత్న అవార్డుకు ఎంపికైన ఎంపీ రామ్మోహన్‌నాయుడిని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అభినందించారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ఎంపీ రామ్మోహన్‌నాయుడి చూపిన చొరవకు దక్కిన గుర్తింపు ఇదని ఆయన కొనియాడారు. అతి చిన్న వయసులోనే అవార్డు అందుకోనున్న ఎంపీగా, ఇది తెలుగుదేశం పార్టీకి కూడా గర్వకారణమని ఆయన అన్నార.

ఇదీ చదవండి : పార్టీని, అధ్యక్షుడినిగానీ పల్లెత్తు మాట అనలేదు :ఎంపీ రఘురామకృష్ణరాజు

Last Updated : Jun 24, 2020, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.