ETV Bharat / state

వినోద్​ను పరామర్శించిన ఎంపీ రామ్మోహన్​ నాయుడు - mp rammohan updates

పాతపట్నం ఉపకారాగారంలో ఉన్న సోషల్​ మీడియా కార్యకర్త వినోద్​ను ఎంపీ రామ్మోహన్​ నాయుడు పరామర్శించారు. అతనిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో పోరాడుతామన్నారు.

mp rammohan naidu  consulted vinod
ఎంపీ రామ్మోహన్​ నాయుడు
author img

By

Published : Jan 16, 2021, 7:42 PM IST

శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం ఉప కారాగారంలో ఉన్న వినోద్​ను శనివారం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పరామర్శించారు. మంత్రి సీదిరి అప్పలరాజుపై సోషల్ మీడియాలో వినోద్ అనే తెదేపా కార్యకర్త పోస్టు పెట్టారని అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. పలాసలో మంత్రి కోసం పోలీసులు పని చేస్తున్నారని ఎంపీ మండిపడ్డారు.

పండగ సమయంలో ఇంట్లో ఉన్న వినోద్​ను పోలీసులు దౌర్జన్యంగా తీసుకువెళ్లి అక్రమ కేసులు పెట్టారన్నారు. తెదేపా బృందం.. ఎస్పీ అమిత్ బర్దార్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లాలో కొంతమంది పోలీసులు ప్రవర్తన బాగా లేదన్న ఎంపీ.. తెదేపా కార్యకర్తలపైనా ఇలా కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీనిపై పూర్తిస్థాయిలో పోరాటం చేస్తామన్నారు.

ఇదీ చదవండి

తెదేపాకు అనుకూలుడనే కక్షతోనే వినోద్‌పై అక్రమ కేసులు: ఎంపీ రామ్మోహన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.