ETV Bharat / state

'పరిహారం చెల్లించకుండా అన్యాయం చేస్తున్నారు'

శ్రీకాకుళం జిల్లాలోని హిరమండలం రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా అన్యాయం చేస్తున్నారని... ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన హామిని మర్చిపోయారని విమర్శించారు. రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

mp kinjarapau rammohan naidu demands to give compensation for hiramandalam reservoir residents
'పరిహారం చెల్లించకుండా అన్యాయం చేస్తున్నారు'
author img

By

Published : Nov 22, 2020, 10:53 PM IST

శ్రీకాకుళం జిల్లా హిరమండలం రిజర్వాయర్ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఎంపీ కింజారాపు రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్ ప్రభుత్వాన్ని కోరారు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తామని పాదయాత్ర చేసిన సమయంలో జగన్ హామీ ఇచ్చారన్నారు. ఎన్నికల్లో ఓట్లు వేసుకుని ఇచ్చిన హామీని మర్చిపోయి నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరకులు ధరలు పెంచి అన్యాయం చేశారన్నారు.

ప్రభుత్వ ప్రజావ్యతిరేక పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని... గతంలో చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు వివరించాలని శ్రేణులకు సూచించారు. త్వరలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

ఇదీ చదవండి:

ఇచ్చిన హమీలను వెంటనే నెరవేర్చాలి: ఏపీఎన్జీవో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.