MINISTER DHARMANA ON THREE CAPITAL ISSUE : రాజధానిని అడ్డంపెట్టుకొని.. అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల సిల్వర్ జూబ్లీహాల్‌లో స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన.. "మన విశాఖ-మన రాజధాని" పేరిట రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 33 వేల ఎకరాలను రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అంగీకరించడం లేదన్న అక్కసుతోనే తమపై బురద జల్లుతున్నారని విమర్శించారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని వద్దని శ్రీకృష్ణ కమిటీ సూచించిందన్న ధర్మాన.. ఆ కమిటీ నివేదికను పక్కనపెట్టి.. చంద్రబాబు కమిటీతో ఎవరికీ తెలియకుండా అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశారన్నారు. దేశంలో చాలా రాష్ట్రాలు వికేంద్రీకరణ అనుసరిస్తున్నాయన్న మంత్రి.. విశాఖ రాజధానిపై ప్రజల్లో తీవ్రత తెలియాలనే ఉద్దేశంతో.. రాజీనామా అన్నానని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: