ETV Bharat / state

'మెట్​కోర్​ ఫెర్రో ఎల్లాయిస్​ పరిశ్రమను తెరిపించండి' - metcore factory latest news

టెక్కలి సమీపంలో ఉన్న ఫెర్రో ఎల్లాయిస్​ పరిశ్రమను తెరిపించాలంటూ ఆ సంస్థ కార్మికులు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ పరిశ్రమపై ఎన్నో బతుకులు ఆధారపడి ఉన్నాయని వారు చెప్పారు.

metcore factory union leaders met janasena leader in visakahapatnam and urges to open factory
జనసేన నేతకు వినతిపత్రం అందిస్తున్న యూనియన్ ప్రతినిధులు
author img

By

Published : Jun 8, 2020, 6:17 PM IST

శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో మూతపడిన మెట్​కోర్ ఫెర్రో ఎల్లాయిస్​ పరిశ్రమను తెరిపించాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్​ను కార్మికులు కోరారు. ​కార్మికులంతా విశాఖలో ఆయన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గత ఐదేళ్లుగా పరిశ్రమ లాక్​ఔట్​ ప్రకటించి నేటి వరకూ తెరవకుండా కార్మికుల పొట్ట కొట్టిందని శివశంకర్​ వద్ద వాపోయారు.

ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న 500 కుటుంబాల బతుకులు ప్రశ్నార్థకంగా మారాయన్నారు. ఈ విషయంపై జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ చొరవ చూపాలని కార్మికులు కోరారు. వీరి వెంట జనసేన టెక్కలి నియోజకవర్గ ఇంఛార్జ్​ కణితి కిరణ్​ ఉన్నారు.

ఇదీ చదవండి:

'మంత్రి గారూ.. విరాళాల లెక్కలు చెప్పండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.