ETV Bharat / state

మాట వినకుండా బయటకు వస్తే కఠిన చర్యలు - Lockdown News in Narasannapeta

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలో లాక్​డౌన్​ కొనసాగుతోంది. పలు పట్టణాల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేశారు. అత్యవసర పనులు మినహా ఎవరూ బయటకు రాకూడదంటూ తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.

శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న లాక్​డౌన్

author img

By

Published : Mar 24, 2020, 7:49 PM IST

శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న లాక్​డౌన్

శ్రీకాకుళం జిల్లాలో లాక్​డౌన్​ కొనసాగుతోంది. అధికారులు ఎప్పటికప్పుడు పట్టణాల్లో పర్యవేక్షిస్తున్నారు.

సామాజిక దూరం పాటించని ప్రజలు..
శ్రీకాకుళం జిల్లాలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ప్రజలు మార్కెట్లకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫలింతంగా మార్కెట్‌లు రద్దీగా మారాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక దూరం పాటించాలని చెబుతున్నా శ్రీకాకుళం రైతు బజార్​లో ప్రజలు గుంపులుగా కొనుగోలు చేస్తున్నారు.

ఆమదాలవలసలో 144 సెక్షన్​
ఆమదాలవలసలో జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. ఉగాది సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు సామగ్రి కొనుగోలు చేసిన అనంతరం దుకాణాలు మూసివేశారు. స్థానిక ఎస్ఐ లావణ్య ప్రజలకి కరోనాపై అవగాహన కల్పించారు.

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు
జిల్లాలో పోలీస్​ పహారాలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. రోడ్లపైకి వచ్చివారిని పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా రోడ్లపైకి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని గ్రామాల్లో, పట్టణాల్లో పోలీసులు, అధికారులు అవగాహన చర్యలు చేపడుతున్నారు.

ఆంధ్ర-ఒడిశా సరిహద్దు బంద్​
ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం చెక్​పోస్ట్ వద్ద వాహనాల రాకపోకలను నిలిపివేశారు. లారీలు మాత్రం యధావిధిగా రాకపోకలు సాగిస్తున్నారు. పాసింజర్ వాహనాలను రాకపోకలను మాత్రం పూర్తిగా నిషేధించారు.

కరోనాకు కంచె వేసిన యువత
బూర్జ మండలం కొండపేట కూడలి వద్ద స్థానిక యువత రహదారిపై ముళ్ల కంచెలు వేశారు. వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించటం వల్ల కరోనా వైరస్ సోకే ప్రమాదముందని రహదారిని నిలిపివేసినట్లు యువత తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గ్రామాల్లోకి ఎవరూ రాకుండా కంచె ఏర్పాటు చేసినట్లు గ్రామస్థులు వివరించారు.

ఒకే చోట నలుగురు ఉంటే చెడుగుడే
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు నరసన్నపేటలో 144 సెక్షన్ అమలు చేశారు. అయినప్పటికీ ప్రజలు పట్టించుకోకపోవటం వల్ల పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. దుకాణాలు వద్ద గుమికూడిన ప్రజలను చెదరగొట్టారు. ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

నిర్మానుష్యంగా మారిన ఇచ్చాపురం
లాక్​డౌన్​ కారణంగా ఇచ్చాపురం మొత్తం నిర్మానుష్యంగా మారింది. ఎక్కడికక్కడ పోలీస్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి పూర్తిస్థాయిలో రాకపోకలు నిలిపివేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరినీ బయటకు రావద్దని హెచ్చరించారు.

ఇదీ చూడండి: కరోనాకు కంచెతో అడ్డుకట్ట..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.