విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ప్రైవేటీకరణకు సీఎం సహకరిస్తున్నాడంటూ వామపక్ష నేతలు ఆరోపించారు. త్యాగాలు చేసి సాధించిన ఉక్కు పరిశ్రమను.. మళ్లీ త్యాగాలతోనే నిలబెట్టుకుంటామని అన్నారు. కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సామాన్య ప్రజలు ఎవరికీ భయపడరని.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు.
ఇదీ చదవండి: 'విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాల్సిన అవసరం లేదు'