మీడియాతో మాట్లాడుతున్న కూన రవికుమార్ తెదేపా అధినేత చంద్రబాబును ఉద్దేశించి సభాపతి తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఖండించారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉంటూ అసభ్యకరమైన భాష వాడటం సరికాదన్నారు. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ అంశం కోర్టు పరిధిలో ఉంటే ఆ విషయంపై ఇష్టారాజ్యంగా మాట్లాడే హక్కు స్పీకర్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. స్పీకర్‌గా ఉంటూ రాజకీయ విమర్శలు చేయకూడదనే ప్రాథమిక సూత్రం మర్చిపోయారని విమర్శించారు. మంత్రి పదవి ఆశించి... జగన్ వద్ద మార్కులు కొట్టేసేందుకే తమ్మినేని ఇలాంటి వ్యాఖ్యలు చేశారని రవికుమార్ అన్నారు. తమ్మినేని భాషను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని... ఆయన్ను అమరావతి నుంచి ఆమదాలవలసకు పంపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. స్పీకర్... వెంటనే చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నైతిక విలువల గురించి... సభాపతి తమ్మినేని చేసిన గత వ్యాఖ్యలు... తాజాగా చంద్రబాబుపై చేసిన విమర్శల వీడియోలు రవికుమార్ ప్రదర్శించారు. ఇదీ చదవండి :
''ఎన్ని కేసులు పెట్టినా చివరి వరకూ తెదేపాలోనే ఉంటా''