జగన్మోహన్ రెడ్డి పాలన శ్రీకాకుళం జిల్లాను అధోగతి చేసిందని తెదేపా నేత కూన రవికుమార్ ఎద్దేవా చేశారు. రైతు భరోసా కేంద్రాల పనితీరును కూన రవి తప్పు పట్టారు. శ్రీకాకుళం జిల్లాలో వైకాపా నాయకులు ఎరువులను పక్కదారి పట్టిస్తున్నారని విమర్మించిన ఆయన.. సాగునీటి వనరుల ద్వారా చివరు భూములకు సాగునీరు ఇవ్వలేని పరిస్థితి జిల్లాలో ఉందన్నారు. ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే వరి నారుమడులు ఎండిపోతున్నాయన్నారు. జిల్లాలో యూరియా లేక రైతులు నానాపాట్లు పడుతున్నారన్నారు.
ఇదీ చదవండి: