ETV Bharat / state

గ్రామ స్వరాజ్యానికి రూపాన్నిచ్చాడు... విజేతగా నిలిచాడు..! - శ్రీకాకుళం జిల్లా కొల్లివలస బాలయోగి గురుకుల పాఠశాల వార్తలు

గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి రూపాన్ని ఇచ్చాడు సిక్కోలు విద్యార్థి. ఎంకే గాంధీయన్ ఐడియాస్‌లో గ్రామ స్వరాజ్‌ ప్రాజెక్టు తయారు చేసి జాతీయ స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది గాంధీయన్ ఛాలెంజ్ పేరుతో అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి అయోగ్, యునిసెఫ్‌ నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాడు.

kollivalasa student got  Gram Swaraj project at MK Gandhian Ideas topped the national competition
తొమ్మిదో తరగతి విద్యార్థి క్రాంతిభూషణ్ తయారుచేసిన గ్రామ స్వరాజ్‌ ప్రాజెక్టు
author img

By

Published : Dec 12, 2019, 11:39 AM IST

గ్రామ స్వరాజ్యానికి రూపాన్నిచ్చాడు... విజేతగా నిలిచాడు..!

గాంధీయన్ ఛాలెంజ్...
యునిసెఫ్ దేశవ్యాప్తంగా ఈ ఏడాది అక్టోబరు నెలలో గాంధీయన్ ఛాలెంజ్ పేరుతో విజ్ఞానం, ఆవిష్కరణలతోపాటు కళలపై పోటీలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా అటల్ టింకరింగ్‌ ల్యాబ్‌ ఉన్న 3 వేల పాఠశాలలకు గాంధీజీ ప్రబోధించిన సిద్ధాంతాలపై ఈ పోటీలు జరిగాయి. 3,800 ఆవిష్కరణలు పోటీల్లో పాల్గొనగా... 50 ఉత్తమమైనవి ఎంపిక చేశారు. శ్రీకాకుళం జిల్లా కొల్లివలస బాలయోగి గురుకుల పాఠశాల విద్యార్థి తయారు చేసిన ప్రాజెక్టుకు ప్రథమ స్థానం లభించింది.

ఈ ప్రాజెక్టు తయారీలో తొమ్మిదో తరగతి విద్యార్థి క్రాంతిభూషణ్ ప్రధాన భూమిక పోషించగా... తోటి విద్యార్థులు చంద్రశేఖర్, సందీప్‌కుమార్‌ సహకరించారు. ఈ ప్రాజెక్టుకు ఉపాధ్యాయుడు త్రినాథరావు, ఏటీఎల్ శిక్షకుడు శివసంతోష్ చేయూతనిచ్చారు. రోబోటిక్ యంత్రాల సాయంతో తక్కువ వ్యయం, తక్కువ సమయంలో వ్యవసాయ పనులు ముగించుకునేలా చూడటం ఎంకే గాంధీ ఐడియాస్ ఆఫ్ గ్రామ స్వరాజ్ ప్రాజెక్టు తయారీ ముఖ్య ఉద్దేశం.

గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం..
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రయోగం ద్వారా సాధించవచ్చు. దేశంలో ప్రజలకు అవసరమైన ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచడానికి ఇది ఎంతో ఉపయుక్తం. భూమిలో విత్తనం నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చేవరకు, వివిధ పద్ధతుల్లో సేకరించే విధానాలు చేపట్టవచ్చు.

రోబోటిక్ పరికరాలు ఉపయోగించి చేనేత వస్త్రాలు నేయవచ్చు. ప్రస్తుతం గ్రామాల్లో ఆయా రంగాలు కుంటుపడుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి రోబోటిక్ యంత్రాలు దోహదపడతాయని చెప్పడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం.

జనాభా పెరుగుదల ఆధారంగా ఉత్పత్తులు పెంచాలి..
క్రాంతిభూషణ్ తయారు చేసిన ఈ ప్రాజెక్టు దేశంలోనే మొదటి స్థానం పొందడం ఆనందంగా ఉంటుందన్నారు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్.
జాతీయస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన 30మందిలో మొదటి పది మందికి త్వరలో దిల్లీలో బహుమతి ప్రదానం చేయనున్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.