ETV Bharat / state

వేణుగోపాలుడి సేవలో... తరించిన జనం! - వేణుగోపాలస్వామి తిరు కల్యాణం న్యూస్

శ్వేతగిరి జన సంద్రమైంది.. వంశధార నదీతీరం భక్తులతో ఉప్పొంగింది.. ఎటుచూసినా వేణుగోపాలుడి స్మరణే.. ఏ నోట విన్నా శరణు ఘోషే.. అదిగో అల్లదిగో.. కొండపై కొలువైన వేణుమాధవుడు అంటూ భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.. దారులన్నీ అటువైపే సాగాయి.

sweatha giri
ఘనంగా కాళీయమర్దన వేణుగోపాలస్వామి తిరుకల్యాణ మహోత్సవం
author img

By

Published : Feb 24, 2021, 2:27 PM IST

ఘనంగా కాళీయమర్దన వేణుగోపాలస్వామి తిరుకల్యాణ మహోత్సవం

శ్రీకాకుళం జిల్లా గార మండలం శాలిహుండంలో కాళీయమర్దన వేణుగోపాలస్వామి తిరుకల్యాణ మహోత్సవం మంగళవారం కన్నుల పండువగా సాగింది. ఈ క్రతువులో భాగంగా జరిగిన చక్రతీర్థ పుణ్యస్నానాల్లో భక్తులు పాల్గొని తరించారు. ఈ మహోత్తర ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా వచ్చారు. ఇసుకేస్తే రాలనంతగా ఆలయ పరిసరాలు దర్శనమిచ్చాయి. సోమవారం అర్ధరాత్రి నుంచే దర్శనానికి బారులు తీరారు. గార - చింతాడ రహదారి, కొండపై ఘాట్‌రోడ్డులో సాయంత్రం వరకూ రాకపోకలు స్తంభించాయి. రాత్రి 8 గంటల వరకు దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేవాదాయ, పోలీసు శాఖలు పటిష్ట ఏర్పాట్లు చేశాయి.

ప్రతి ఏటా భీష్మ ఏకాదశి పర్వదినాన స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ జాతరలో భాగంగా స్వామివారి మూలవిరాట్టుకు పంచామృతాభిషేకం, విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు చేశారు. శ్రీదేవి, భూదేవి సహిత వేణుగోపాల స్వామి ఉత్సవమూర్తులకు వంశధారనదిలో చక్రస్నానం నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోభస్తు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి: భీష్మ ఏకాదశి వేడుకల్లో ఆకట్టుకున్న అరటి గెలల పందిరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.