వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో తెదేపా నేత కళా వెంకట్రావు ఆరోపించారు. కూన రవికుమార్ ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తున్నారని... ప్రజాసమస్యలను ప్రశ్నించేందుకే ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారని ఆయన స్పష్టం చేశారు. కూన రవిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలే గానీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని హితవు పలికారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార పార్టీ వ్యక్తులు ఎలా కూర్చుంటారని... ఇతరపార్టీల వారు ప్రభుత్వ కార్యాలయాలకు రావొద్దని ఎలా చెబుతారని కళా ప్రశ్నించారు.
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి ఎంపీడీవో కార్యాలయంలో మాజీ విప్ కూన రవికుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని... ఆయనతో పాటు మరో 11మందిపై కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి-ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్‌పై కేసు నమోదు