ETV Bharat / state

100 రోజుల వైకాపా పాలనతో ప్రజల్లో విరక్తి: కళా వెంకట్రావు - 100 రోజుల వైకాపా పాలనతోనే ప్రజలు విరక్తి : కళా వెంకట్రావు

తండ్రి సీఎంగా ఉన్నప్పుడు అధికారం అడ్డుపెట్టుకుని రూ.50 వేలు కోట్లు జగన్ సంపాదించారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. ఐదేళ్లలో ఆ సొమ్ము రూ. 2.50 లక్షల కోట్లు దాటిందని ఆరోపించారు. జగన్ సీఎం అయిన క్షణం నుంచి ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

100 రోజుల వైకాపా పాలనతోనే ప్రజలు విరక్తి : కళా వెంకట్రావు
author img

By

Published : Sep 30, 2019, 11:30 PM IST

100 రోజుల వైకాపా పాలనతోనే ప్రజలు విరక్తి : కళా వెంకట్రావు
వై.యస్ సీఎంగా ఉన్నప్పుడు..ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ సంపాదించిన సొమ్ము ఇప్పుడు రూ. 2 లక్షల 50 వేల కోట్లు ఉంటుందని తెదేపా రాష్ట్రఅధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం తెదేపా కార్యాలయంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. సమావేశంలో మాట్లాడుతూ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ సంపాదించిన అవినీతి సొమ్ము 50 వేల కోట్లు ఈ ఐదేళ్లలో రూ.2 లక్షల 50 వేల కోట్లు అయ్యిందని ఆరోపించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నుంచి తన ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టుకున్న ముఖ్యమంత్రి.. జగన్ ఒక్కరేనని ఎద్దేవా చేశారు. వంద రోజుల పాలనలో ప్రజలు విసిగిపోయారన్న ఆయన... కేసులు పెట్టినంత మాత్రాన తెదేపా కార్యకర్తలు భయపడరన్నారు. ప్రజలను భయాందోళనలకు గురి చేయడమే కాకుండా పులివెందుల ఫ్యాక్షనిజం చూపిస్తున్నారని విమర్శించారు. అన్న క్యాంటీన్, నిరుద్యోగ భృతి నిలిపివేసి, నిత్యం కరెంటు కోతలతో ప్రజలను క్షోభకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ వంద రోజుల పాలనకే ప్రజలు విరక్తి చెందారని అన్నారు.

ఇదీ చదవండి :

మంత్రి అవంతి-ద్రోణంరాజు శ్రీనివాస్​ మధ్య వాగ్వాదం

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_33_30_trust_board_temples_p v raju_av_AP10025 తూర్పు గోదావరి జిల్లాలో అంతర్వేది, మందపల్లి, వాడపల్లి, కాకినాడ ఎం.ఎస్.ఎన్. ఛార్టిస్ కు ధర్మకర్తల మండలి నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 20 రోజుల్లోగా ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తు నమూనా తో సహా జీవో నెంబర్ 986తో ఉత్తర్వులు జారీచేసింది. హిందూ, ధార్మిక సంస్థలు, ట్రస్టులు, దేవాదాయ శాఖ చట్టం ప్రకారము రూ 1 నుంచి5 కోట్లు వార్షిక ఆదాయం కలిగిన ఆలయాలకు ప్రస్తుతం నియామక ఉత్తర్వులు జారీచేసింది.

Conclusion:ఓవర్.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.