శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు ఇచ్చాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను ఆయన పరిశీలించారు. దుకాణాలు దూరంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యాపారస్తులనుంచి ధరల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రిలీఫ్ సెంటర్‌ను పరిశీలించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న వారితో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు.
ఇదీ చూడండి: