శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కరోనా వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో క్షేత్రస్థాయి సిబ్బందితో ఆయన సమీక్షించారు. కరోనా వైరస్ పాజిటివ్ సోకిన వ్యక్తులు బయట తిరగవద్దు అని కోరారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ఆటంకాలు కలిగించవద్దని అన్నారు. మరో పది రోజుల పాటు కరోనా వైరస్ నియంత్రణకు కష్టపడి పని చేయాలని సూచించారు. సమావేశంలో ప్రత్యేక అధికారి వెంకటరామన్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి.