ETV Bharat / state

టెక్కలి పీఎస్ ఎదుట జనసేన శ్రేణుల నిరసన - శ్రీకాకుళం జిల్లా

శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్ స్టేషన్ ఎదుట జన సైనికులు నిరసన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారిని వేధిస్తున్నారని అన్నారు.

srikakulam district
టెక్కలి పీఎస్ ఎదుట జనసేన శ్రేణుల నిరసన
author img

By

Published : Jun 17, 2020, 9:18 PM IST

శ్రీకాకుళం జిల్లాలో జన సైనికులు 50మంది వరకు టెక్కలి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని పోలీసుల తీరును ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెడుతున్నారన్న అకారణంగా జనసేన కార్యకర్త ముడిదాన రాంప్రసాద్, ఆయన తండ్రి ఆనంద కుమార్​లను రెండు రోజులుగా పోలీస్​స్టేషనుకు పిలిపించి వేధిస్తున్నారని, దుర్భాషలాడుతున్నారని బాధితులు ఆరోపించారు. వారికి మద్దతుగా జనసేన టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కణితి కిరణ్ కుమార్,
ఇతర నేతలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఫిర్యాదుదారులెవరో చెప్పకుండా పోలీసులు వేధింపులకు గురి చేయడం తగదని, అధికార పార్టీకి కొమ్ముకాస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేయడం తగదని అన్నారు. స్థానికంగా సీఐ, ఎస్ఐ అందుబాటులో లేకపోవడంతో కాసేపు నిరసన అనంతరం వెనుదిరిగారు.

ఇది చదవండి బాలికపై అత్యాచారం కేసు.. విచారిస్తున్న పాలకొండ పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.