శ్రీకాకుళం గిరిజన యువత శిక్షణ కేంద్రంలో విద్యార్ధులందరూ క్షేమంగానే ఉన్నారని సీతంపేట ఐటీడీఏ పీవో శ్రీధర్ తెలిపారు. ఐఐటీ శిక్షణ పొందుతున్నవిద్యార్ధులు... కొవిడ్ బారిన పడిన సంఘటనపై స్పందించిన పీవో శ్రీధర్... విద్యార్థులందరికీ పౌష్ఠికాహారం అందిస్తూ వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు.
స్వస్థలాలకు వెళ్లిన విద్యార్థుల్లో 28 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు పీవో వెల్లడించారు. ప్రస్తుతం వారందరూ కొవిడ్ కేర్ సెంటర్‌లో ఉంటున్నారన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మవద్దన్న పీవో శ్రీధర్ కోరారు.
ఇదీ చదవండి: