శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కొండపల్లి గ్రామ ప్రజలను ఎలుగుబంట్లు భయపెడుతున్నాయి. నిత్యం గ్రామ పరిసరాల్లోని తోటల్లోకి వస్తున్నాయి.. కనిపించిన వ్యక్తులపై దాడులు చేస్తున్నాయి. తాజాగా ఓ జీడితోటలోకి వచ్చిన రెండు ఎలుగుబంట్లు స్థానికులపై దాడి చేశాయి. ఈ దాడిలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. గ్రామంలోకి తరచూ ఎలుగుబంట్లు వస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఎలుగుబంట్ల దాడి నుంచి రక్షణ కోసం కుక్కలను కాపలాగా పెట్టుకుంటున్నారు. తాజాగా తోటలోకి వచ్చిన ఎలుగుబంట్లను కుక్కలు తరిమివేశాయి. వరుసగా ఎలుగుబంట్లు దాడులు చేస్తున్నా అటవీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది చూడండి: జాగ్వార్ కొనలేదని బీఎండబ్ల్యూను కాల్వలో పడేశాడు!