శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు. జిల్లాలో 38 జెడ్పీటీసీ, 668 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో 19 లక్షల 24 వేల మంది ఓటర్లు ఉన్నారని... తుది జాబితాను త్వరలో తయారు చేస్తామన్నారు. శ్రీకాకుళం నగర పాలక సంస్థలో విలీన ప్రక్రియ కారణంగా ఏడు గ్రామ పంచాయతీలకు.. పలాస మునిసిపాలిటీలో విలీన ప్రక్రియ వలన ఒక గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరిగే అవకాశం లేదన్నారు.
ఇదీ చదవండి: సైకత శిల్పాలు... ఎన్నెన్నో భావాలకు ప్రతిరూపాలు