ETV Bharat / state

అక్రమ మద్యం పట్టివేత.. నిందితుల అరెస్టు

author img

By

Published : Jan 30, 2021, 3:26 PM IST

రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

seized liquor
అక్రమ మద్యం పట్టివేత

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పర్వతాలపేట గ్రామంలో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీఐ ప్రసాదరావు ఆదేశాల మేరకు వైకాపా నాయకుడి అనుచరుడు సిమ్మ శ్రీనివాసరావు ఇంట్లో తనిఖీలు చేశారు. సుమారు రూ.75 వేలు విలువ చేసే 541 మద్యం బాటిళ్లు సీజ్​ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

ప్రకాశం జిల్లాలో..

జిల్లాలోని యర్రగొండపాలెం ఎస్ఈబీ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి రవాణా చేస్తున్న 1,104 సీసాలతో పాటు రెండు కార్లు, రెండు బైక్​లు సీజ్​ చేసినట్లు తెలిపారు. వారి నుంచి రూ.66,600 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని.. మరో ముగ్గురుని అరెస్టు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: అక్రమ మద్యం పట్టివేత.. బెల్లం ఊట ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.