ముంపు ప్రాంతాన్ని ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేయడంపై ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ మండిపడ్డారు. పేదలకు ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలోని ధర్మపురం, డొంకూరు తదితర గ్రామాలలో ఆయన పర్యటించారు. వరి పంట పూర్తిగా నాశనమైందనీ.. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పల్లెల్లో కొరవడిన పారిశుద్ధ్యాన్ని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
![mla ashok visiting fields](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9185776_2.jpg)
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇచ్చాపురం నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పంటలు నాశనమయ్యాయి. వాగులు, వంకలు పొంగుతూ ఉండటంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది.
ఇదీ చదవండి: 'వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకాకుళం నుంచే శ్రీకారం'