తెలుగు తేజం.. ఐఏఎస్ రవి కోట అగ్ర గుర్తింపు పొందారు. అగ్రరాజ్యం అమెరికాలో భారత రాయభార కార్యాలయంలో ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా నియమితులయ్యారు. అమెరికాలో భారత ఆర్థిక దౌత్యవేత్తగా ఐఏఎస్ రవి కోటను నియమిస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
ఐఏఎస్ రవి కోట నియమకంపై కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు డీఓపీటీ ప్రకటించింది. అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో ఆర్థిక వ్యవహారాల చీఫ్‌గా రవి కోట విధులు నిర్వర్తించనున్నారు. 1993 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రవి కోట.. స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కోటపాడు. ప్రస్తుతం ఆయన 15వ ఆర్థిక సంఘం సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
ఇదీ చదవండి : ప్రధాని మోదీ రైతు పక్షపాతి: విష్ణువర్ధన్ రెడ్డి