శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని భవానిపురం వీధికి చెందిన గానుగుల జయలక్ష్మి(70) అనే వృద్ధురాలు మరణించింది. సమీపంలోని సంతతోట శ్మశానవాటికలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో మృతురాలి ఒంటిపై ఉన్న పది తులాల బంగారు ఆభరణాలను తీసి… కుటుంబ సభ్యులు ఓ వస్త్రంలో కట్టి భద్రపరిచారు. దహన సంస్కారాలు ముగిశాక వాటిని అక్కడే మరచిపోయి వెళ్లారు. అనంతరం.. మరో మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు వచ్చిన కాటికాపరులు జయలక్ష్మి కుటుంబ సభ్యులు వదిలి వెళ్లిన నగలు గమనించారు. వెంటనే వారిని సంప్రదించి.. బంగారు ఆభరణాలను అందజేశారు. జమ్ము గ్రామానికి చెందిన కోటిపల్లి రాము, బొంతల వీధికి చెందిన కంబకాయ ఎల్లయ్య రజక వృత్తి చేస్తూ కాటికాపర్లుగా ఉన్నారు. వారిద్దరూ చూపిన నిజాయతీకి స్థానికులు, జయలక్ష్మి కుటుంబ సభ్యులు అభినందించారు.
ఇదీ చదవండి: Rare treatment: నవజాత శిశువుకు.. కోవిడ్ మల్టీ సిస్టమ్ సిండ్రోమ్ చికిత్స