అత్యుత్సాహం, అలసత్వం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తప్పవని హోంమంత్రి మేకతోటి సుచరిత పునరుద్ఘాటించారు. హైదరాబాద్లో హోంమంత్రి సుచరిత మీడియాతో మాట్లాడారు. పలాస ఘటనలో దురుసుగా ప్రవర్తించిన కాశీబుగ్గ సీఐపై వేటు వేసినట్లు తెలిపారు. వెలుగోడు ఘటనలో అలసత్వం వహించిన సీఐపై చర్యలు తీసుకున్నట్టు వివరించారు. సీతానగరం శిరోముండనం ఘటనలో ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామని చెప్పారు. చీరాలలో యువకుడి మృతికి కారణమైన ఎస్‌ఐపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. వరకట్న వేధింపుల కేసులు తగ్గాయన్న హోంమంత్రి సుచరిత... దిశ పీఎస్‌లో ఫిర్యాదులపై 169 కేసులు, వారంలోనే నిందితుల అరెస్టు చేసినట్టు వివరించారు. పోలీసుల ప్రమేయం ఉంటే వారిపైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... అన్ లాక్ 3.0.. మార్గదర్శకాలు అమలు చేస్తూ.. ఉత్తర్వులు